AICTE తాజా అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల..

AICTE Updates: Instructions To Institutes During Lockdown 2.0 ...

కరోనా కారణంగా ఇప్పటికే ఆలస్యమైన ప్రవేశాలు ఇకపై ఊపందుకోనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం(2020-21)లో బీటెక్, బీఫార్మసీ ఫస్టియర్‌ తరగతులను నవంబరు 1వ తేదీ లోపు ప్రారంభించాలి. ఈ మేరకు అఖిల భారత సాంకేతికత విద్యామండలి(ఏఐసీటీఈ) తాజాగా సవరించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను జారీ చేసింది.

కరోనా నేప‌థ్యంలో ఈ షెడ్యూల్‌ జారీ చేస్తున్నామని, కేంద్ర ఆరోగ్య, మానవ వనరుల శాఖ మార్గదర్శకాలను అనుసరించి వాటిలో మార్పులకు అవకాశం ఉందని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. పాత క్యాలెండర్‌ ప్రకారం అక్టోబరు 15 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉండగా ప్రస్తుతం దాన్ని మార్చి కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

తాజా షెడ్యూల్‌ ప్రకారం:

  • సెప్టెంబరు 1లోపు పాత విద్యార్థులైన‌ 2, 3, 4 సంవత్సరాల వారికి తరగతులు ప్రారంభించాలి.
  • సెప్టెంబరు 15 ప్రైవేట్‌ కాలేజీలకు ఆయా విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు చివరి తేదీ.
  • అక్టోబరు 20 ఫస్టియర్‌ వాళ్లకి మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తి.
  • నవంబరు 1 రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తిచేయాలి. తరగతులు ప్రారంభించాలి.
  • నవంబరు 15 ఖాళీ సీట్లలో విద్యార్థులు చేరేందుకు తుది గడువు. అయితే కరోనా పరిస్థితులను బట్టి షెడ్యూల్‌ మారొచ్చే లేక మారకపోవచ్చు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.