TS: ఇంటర్‌ విద్యార్థులకు ప్రొఫెషనల్‌ కౌన్సెలింగ్‌..!

 Andhra Pradesh: Jumbling system leaves Inter students in a daze

విద్యా జీవితంలో ఇంటర్‌ ఎంతో ప్రత్యేకమైంది. ఇది విద్యార్థులు బాల్యం నుంచి కౌమారదశకు చేరే సమయం. సరిగ్గా ఇదే సమయంలో విద్యార్థులు ఇంటర్‌ విద్యలో ఉంటారు. ఈ దశలో ఏర్పడే శారీరక, మానసిక సవాళ్లను ఎదుర్కొనేలా, విద్యలో ఉన్నత శిఖరాలు అందుకునేలా వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులది. ఇందుకోసం విద్యాశాఖ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది.

అదేమిటంటే.. విద్యార్థులకు ప్రొఫెషనల్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ వివరించారు. ఎంసీఆర్‌హెచ్చార్డీ ఆధ్వర్యంలో ఇంటర్‌ విద్య సహకారంతో 2500 మంది జూనియర్‌ లెక్చరర్లకు వర్చువల్‌ మోడ్‌, ఆన్‌లైన్‌ మోడ్‌ ద్వారా కౌన్సెలర్లుగా శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఇండియన్‌ హెల్త్‌ అసోసియేషన్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌)కు చెందిన నిపుణులు శిక్షణ ఇచ్చారు. దీన్ని ప్రాక్టికల్‌గా త్వరలో అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.