Clarity by Government To Schools Reopen In Telangana

Post-pandemic, a shift in mindset will be needed — to teach and ...

స్కూళ్లు పునః ప్రారంభంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ప్రభుత్వం కోర్టుకు స్పష్టంచేసింది.

రాష్ర్టంలో ఆన్‌లైన్‌ తరగతులు, విద్యా సంవత్సరంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. పాఠశాలల పునఃప్రారంభం కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ప్రభుత్వం కోర్టుకు స్పష్టంచేసింది.


విద్యా సంవత్సరం ఖరారు చేసే పనిలో ఉన్నామని నివేదికలో పేర్కొంది. కరోనా కారణంగా చాలా రాష్ట్రాలు ఇంకా విద్యా సంవత్సరం ఖరారు చేయలేదని తెలిపింది. అనువైన రోజుల కోసం చూస్తున్నామని చెప్పింది. అలాగే ఆన్‌లైన్‌ తరగతులపైనా ప్రభుత్వం తమ వైఖరిని కోర్టుకు విన్నవించింది.

అదనపు ఆర్థిక భారంలేని బోధనా పద్ధతులపై కసరత్తు చేస్తున్నామని తెలిపింది. విద్యా సంవత్సరం, నిరంతర అభ్యసన విధానం ఖరారయ్యాక ఆన్‌లైన్‌ తరగతులపై మార్గదర్శకాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. పాఠశాలల ప్రారంభంపై తల్లిదండ్రుల ఫీడ్‌బ్యాక్ సమర్పించాలని డీఈవోలను ఆదేశించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై ఆగస్టు 5 వరకు సమయం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరామని వెల్లడించింది.

స్కూళ్లు తెరిచే వరకు టీవీలు, ఆన్‌లైన్లో పాఠాలు కొనసాగించేలా‌ ముసాయిదా పాలసీ సిద్ధంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్‌ విద్యపై విద్యారంగ నిపుణులతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.