తగ్గిన కరోనా కొత్త కేసులు.. రేపు భారీ సంఖ్యలో డిశ్చార్జ్! తెలంగాణ‌కు బిగ్ రిలీఫ్..


తెలంగాణలో కొత్తగా 6 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. బుధవారం 8 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 650కి చేరగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 118కి చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కోవిడ్ కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 514 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం మీడియా బుల్లెటిన్ ద్వారా వెల్లడించింది. గురువారం 120 మంది డిశ్చార్జ్ అవుతారని సమాచారం. రాష్ట్రంలోని కరోనా కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో 267 కేసులు నమోదయ్యాయి.

నిజామాబాద్‌లో36 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వికారాబాద్ (32), సూర్యాపేట (23) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జనగామ జిల్లాలో ఇద్దరికి కరోనా సోకగా.. వారిద్దరూ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఆ జిల్లాలో కోవిడ్ ఫ్రీగా మారింది. మహబూబాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో నలుగురు కోవిడ్ బారిన పడగా.. ఇద్దరు కోలుకున్నారు, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో 259 కంటైన్‌మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ముందు జాగ్రత్తగా భారీ సంఖ్యలో బెడ్లను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్లను గుర్తించగా.. తెలంగాణలో 8 హాట్ స్పాట్లను గుర్తించారు. ఏపీలో 11 జిల్లాలు హాట్ స్పాట్‌లుగా ఉన్నాయి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.