SSC Invigilators Instructions in Telugu

పదవ తరగతి పరీక్షలు ఇన్విజిలేటర్ కు సూచనలు



1. బార్ కోడింగు పరీక్ష ప్రారంభానికి ముందురోజు ప్రధాన పర్యవేక్షకులు ఏర్పాటు చేసిన సమావేశానికి విధిగా
హాజరుకావలెను.
2. బార్ కోడింగ్ విధానములో జరుగు పరీక్ష రోజులలో ఇన్విజిలేటర్లు 45 నిమిషములు ముందుగానే తమకు
కేటాయించిన పరీక్షా హాలుకి వెళ్లి విద్యార్థులకు ప్రధాన సమాధాన పత్రములు, ఓ.యం.ఆర్.ఓటులు ఇచ్చి
ముందుగా చేయించవలసిన పనులు పరీక్షా సమయానికి 5 నిమిషాలు ముందుగానే పూర్తి చేయవలెను.
3. ఏ విధ్యార్థి యొక్క ఓ.యం.ఆర్.సీటు ఆ విద్యార్థికే ఇవ్వవలెను. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించవలెను.
తప్పులు జరుగరాదు.
4. విద్యార్థి రోలు నెంబర్. ఎచ్చటా వేయరాదు. విద్యార్థి సంతకముకు కేటాయించిన బాక్సు వద్ద మాత్రమే
సంతరము చేయవలెను. ఇంక ఎచ్చటనూ సంతకముగాని, పేరుగాని వ్రాయరాదు.
5. ప్రధాన జవాబు పత్రము యొక్క మూడు అంకెల సీరియల్ నెంబరును ఓ.యం.ఆర్. షీటులో వేయించవలెను.
ఇన్విజిలేటరు మొత్తం వివరాలు చెక్ చేసి సంతృప్తి చెందిన తరువాత మాత్రమే పూర్తి సంతకమును నిర్దేశించిన
బాక్సులో పెట్టవలెను.
6. ఇన్విజిలేటర్లు ఓ.యం.ఆర్.సీటు పార్టు 1 నందు సూచించబడిన బాక్సునందు, ప్రధాన జవాబు పత్రము, మరియు
అదనపు జవాబు పత్రము నందు తమ పూర్తి సంతకమును చేయవలెను. పార్టు-బి, గ్రాఫ్ మరియు మ్యాపునందు
ఇన్విజిలేటర్లు తమ ఇనీసియల్ వేయవలెను.
1. Answer Booklets Serial Number వరుస క్రమంలో అందరు విద్యార్థులకు అందచేయవలెను. Absent
అయిన విద్యార్థి స్థానములో కూడా ప్రధాన సమాధాన పత్రము ఉంచవలెను.
8. ప్రధాన సమాధాన పత్రము పై విద్యార్థి చేత పబక్టు, పేపరు వివరాలు పూర్తి చేయించాలి. పరీక్ష అనంతరము
అదనపు సమాధానములు ఉపయోగించిన వాటి సంఖ్యను వేయించవలెను.
9. ఏ విద్యాధి యొక్క జ.యం.ఆర్.సీటు ప్రింటెడ్ ది రాకపోతే భాంకు ఓ.యం.ఆర్.షీటు తీసుకొని వివరాలు
ప్రొఫార్మా-11 లో పూర్తిచేయవలెను.
10. ప్రధాన సమాధాన పత్రములు, అదనపు సమాధాన పత్రములు పై ఇన్విజిలేటరు ముందుగా సంతకము
చేయరాదు. వాడని బుక్ లెట్స్ తిరిగి ప్రధాన పర్యవేక్షకులకు అంద చేయవలసి ఉంటుంది. సంతకముతో ప్రధాన
సమాధాన పత్రములు, అదనపు సమాధాన పత్రములు మిగిలి యుండరాదు.
1. ఓ.యం.ఆర్.షీట్స్ ను ప్రధాన సమాధాన పత్రముపైన పెట్టి మార్కు చేయబడిన రెండు చోట్ల సిన్ వేయవలెను.
పిన్నులపై పేపరు సీల్స్ అంటించవలెను. OMR Sheet Lower Edge, Answer Book Lower Edge కంటే 4
మి.మీ. పైన ఉండేలాగున పిప్ చేయవలెను. ఈ కార్యక్రమము పరీక్షా సమయానికి 5నిమిషముల ముందుగానే పూర్తి
కావలెను.
12. విద్యార్థులు అదనపు సమాధాన పత్రములు తీసుకున్నప్పుడు ఆ షీటు యొక్క సీరియల్ నెంబరును ప్రాఫార్మా,
III లో నమోదు చేసి విద్యార్థి యొక్క సంతకము తీసుకొనవలెను . ప్రొఫార్మా, III రెండు కాపీలు తీసుకొని ఒక కాపీ
పోస్టు ఎగ్జామినేషన్ మెటీరియల్ తో ప్రభుత్వ పరీక్షల పంచాలకులు, హైదరాబాదు వారికి పంపవలసి ఉంటుంది.
ఒక కాపీ సెంటరులో ఉంచవలెను. ,
13. ఓ.యం.ఆర్.ఓటు పై బార్ కోడింగు ప్రాంతములో వ్రాయుటగాని, చెరుపుట గాని చేయరాదని, షీటు
సలగకుండా పరీక్ష వ్రాయమని విద్యార్థులకు సూచనలు ఇవ్వవలెను.
14. మ్యాప్, గ్రాఫ్. బిట్ పేపరు లపై కూడ విద్యార్థి రోలు నెంబరు, పేరు వ్రాయరాదు. వీటిపై ప్రధాన సమాధాన
పత్రము పై ఉన్న మూడు అంకల క్రమ సంఖ్యను విద్యార్థిచే వ్రాయించవలెను.
15. నా పంబంధీకులు ఎవరు ఈ సెంటరు నందు పరీక్ష వ్రాయుట లేదని ధృవీకరణ పత్రమును ఇవ్వవలెను.
16. ఇన్విజిలేటర్లు తమకు కేటాయించిన పరీక్ష హాలుకు వెళ్లినపుడు తమతో సెల్ ఫోనులుగాని మరి ఏ ఇతర
సమాచారమును తెలియజేయు సాధనములనుగాని తీసుకొని వెళ్లరాదు.
17. పరీక్ష పూర్తయిన పిదప విద్యార్ధులనుండి వరుసక్రమములో మీడియం వారీగా తీసుకొనవలెను.
ప్రధాన సమాధాన పత్రముతో పాటు విద్యార్థి / విద్యార్థిని బిట్ పేపరు / గ్రాఫ్ / మ్యాప్ ఉన్నచో వాటిని జతచేసినది
లేనిది తప్పక గమనించవలెను.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.