కేపీహెచ్‌బీలో మహిళకు కరోనా పాజిటివ్...తెలంగాణలో ఫస్ట్ లోకల్ కేసు

కరోనా భారత్ దేశంలోనూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. దేశంలో కరోనా కేసులు 300కు చేరాయి. ఇక తెలంగాణా రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు 21కి చేరాయి. దీంతో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అయితే విదేశాల నుంచి వచ్చినవారికి మాత్రమే ఇప్పటివరకు కరోనా సోకిందని తెలంగాణా ప్రభుత్వం , ఆరోగ్య శాఖ వర్గాలు చెప్పిన పరిస్థితి. ఇక ఈ నేపధ్యంలో ఫస్ట్ టైమ్ లోకల్‌గా ఓ మహిళకు కరోనా సోకింది. దీంతో ప్రజల్లో మరింత టెన్షన్ పెరిగింది.

తెలంగాణాలో స్థానిక మహిళకు కరోనా .. మొదటి లోకల్ కేసు ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి కరోనా ఈజీగా వ్యాప్తి చెందుతుంది . అయితే కరోనా పాజిటివ్ ఉన్న సోదరుడి నుండి ఒక సోదరి కరోనా బారిన పడింది. ఇక ఇలా కరోనా రావటాన్ని ప్రైమరీ కాంటాక్ట్ అంటారు. పి-14 కేసు ద్వారా ఇది స్థానికంగా ఒకరికి అంటుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. కేపీహెచ్‌బీలోని ఫేజ్-2 లో నివసించే మహిళకు కరోనా సోకింది. ఇటీవలే బాధితురాలి సోదరుడు యూకే నుంచి వచ్చాడు. అతనితో కలిసి ఉన్న నేపధ్యంలో సోదరికి, ఆమె ఇంట్లో మరో ఇద్దరికి కూడా కరోనా సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటివరకు కరోనా బాధితులు అందరూ విదేశాల నుండి వచ్చిన వారే ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన 21 కేసుల్లో కూడా అందరూ విదేశాల నుంచి వచ్చినవారే . ఇప్పుడు మాత్రం అలా వచ్చినవారి నుంచి ఫస్ట్ టైమ్ వైరస్ మరొకరికి అంటుకుంది. ఇది రాష్ట్రంలో తొలి ప్రైమరీ కాంటాక్ట్ కేసు. ఇక దీంతో తెలంగాణా సర్కార్ అప్రమత్తం అయ్యింది. అవసరం అనుకుంటే ఎలాంటి తక్షణ చర్యలైనా తీసుకుంటాం కానీ కరోనాతో పోరాడతాం అని ప్రకటించారు సీఎం కేసీఆర్ .

లోకల్ కేసు నమోదుతో ప్రజల్లో టెన్షన్ ఏది ఏమైనా కరోనా బాధితుల సంఖ్య మరింత పెరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని చెప్తుంది సర్కార్ . ఇక ఈ నేపధ్యంలో ఒక లోకల్ కేసు నమోదు కావటం ప్రజలను టెన్షన్ పెడుతుంది. సమస్య తీవ్రతరం అవుతున్న భావన కలుగుతుంది.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.